Major Dhyan Chand

హాకీ భారత జాతీయ క్రీడ. హాకీ భారతదేశంలో  బ్రిటిష్ వారిచే ప్రవేశ పెట్టబడినది. ఈ క్రీడను బ్రిటిష్ ఆర్మీ అధికారులు తమ విరామ సమయంలో ఆడేవారు. బ్రిటిష్ ఆర్మీ లో పని చేస్తున్న భారత సిపాయులు ద్వార ఈ క్రీడ భారతీయులకు పరిచయం అయ్యింది. బ్రిటిష్ అధికారులకు మరియు భారత సిపాయులకు మధ్య పోటీలు జరిగేవి. ధ్యాన్ చంద్ తండ్రి సోమేశ్వర్ దత్త్ సింగ్ బ్రిటిష్ ఆర్మీ లో సుబేదారుగా పని చేసేవాడు. ఇతను ఆర్మీ లో హాకీ ఆడుతూ ఉండే వాడు. వృత్తి రిత్య వివిధ ప్రాంతాలకు తిరుగుతూ చివరిగా ఉత్తర ప్రదేశ్ లోని జాన్సీ లో స్థిరపడ్డారు. 1905 ఆగష్టు 29న జాన్సీ లో ధ్యాన్ చంద్ జన్మించాడు. ధ్యాన్ చంద్ తండ్రికి ముగ్గురు కుమారులు మొదటి కుమారుడు ముల సింగ్ , రెండో కుమారుడు ద్యాన్ సింగ్ ( ద్యాన్ చంద్) , మూడో వ కుమారుడు రూప సింగ్. ధ్యాన్ చంద్ తండ్రి తరుచు వివిధ ప్రాంతాలు తిరుగడం వలన వీరి ప్రాధమిక విద్య సరిగా సాగలేదు. పైగా తండ్రి తోపాటు హాకీ మ్యాచులకు వెళ్ళడం వలన హాకీ క్రీడా పై ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా ధ్యాన్ చంద్ కి హాకీ లో ఎక్కువ ఆసక్తి కలిగింది. స్కూల్ కు వెళ్ళే సమయంలో తాటి మట్టలు తో స్టిక్ మాదిరి చేసుకొని పాత గుడ్డలను బంతి గా చేసుకొని ఆడేవాడు. అతి తక్కువ సమయంలోనే హాకీ పై మంచి నైపుణ్యం సంపాదించాడు.

క్రీడా జీవితం : ధ్యాన్ చంద్ ఆటను చూసిన తండ్రి మరియు ఆర్మీ అధికారులు ఆశ్చర్యపోయి ద్యాన్ చాంద్ ను అభినందించి ఆర్మీ లో సిపాయి గా ఉద్యోగం కల్పించారు. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే తను కు ఇష్టమైన హాకీ ని విరామ సమయంలో ను మరియు రాత్రి చందమామ వెన్నెలలో సాధన చేసేవాడు. అందుకు తోటి వారు ద్యాన్ సింగ్ ను ధ్యాన్ చంద్ ( చాంద్ అనగా హిందీ లో చందమామ) అని పిలిచేవారు. ధ్యాన్ చంద్ తన రేంజ్ మెంట్ తరపున హాకీ ఆడుతూ అనేక ఆర్మీ టోర్నమెంట్ లలో తన రేంజ్ మెంట్ కు ఎన్నో విజయాలు అందించాడు. అదే సమయంలో ధ్యాన్ చంద్ ను 1928 ఆమ్ స్టర్ డ్యామ్ ఒలింపిక్స్ కు వెళ్ళే భారత జట్టుకు ఎంపిక చేసారు.
విశ్వ క్రీడలలో ధ్యాన్ చంద్ ప్రతిభ: 1928 ఆమ్ స్టర్ డ్యామ్ ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ భారత జట్టు అమెరికా జట్టు పై 24-1 భారీ తేడాతో రికార్డు విజయం సాధించింది ( ఇప్పటికి ఇది రికార్డు గానే హాకీ చరిత్రలో మిగిలిపోయింది). 1936 బెర్లిన్ ఒలింపిక్ క్రీడలు ఒక వైపు కెప్టెన్ గాను మరియు ప్లేయర్ గా తన మంత్రం ముగ్దమైన ఆట తీరుతో జర్మనీ రాజధాని బెర్లిన్ జరిగిన ఒలింపిక్ క్రీడలలో కూడా భారత జట్టు ఫైనల్ కు చేరింది. ఫైనల్ మ్యాచ్ ఆదిత్య జట్టు జర్మనీతో, మ్యాచ్ కు వేల మంది జర్మన్లు తో పాటు జర్మనీ నియంత హిట్లర్ కూడా మ్యాచ్ కు వచ్చాడు. మ్యాచ్ ప్రారంభం అవగానే ధ్యాన్ చంద్ తన విన్యాసాలతో జర్మనీ పై గోల్స్ వర్షం కురిపించసాగాడు. అది చూసి హిట్లర్ మ్యాచ్ ను మధ్యలో ఆపి ధ్యాన్ చంద్ స్టిక్ ను ఆర్మీ అధికారులు పరిశీలించారు ( స్టిక్ లో ఏమైనా అయస్కాంతం ఉంది అనుకోని). వారు మరొక స్టిక్ ను ధ్యాన్ చంద్ కు ఇచ్చారు. అయిన కూడా ద్యాన్ చంద్ జర్మనీ పై విరుచుకుపడుతూ గోల్స్ వర్షం కురిపించాడు అది చూసి హిట్లర్ కోపంగా లేచి ధ్యాన్ చంద్ ను నా చాంబర్ కు తీసుకొని రండి అని ఆర్మీ అధికారులను ఆర్డర్ వేస్తూ స్టేడియం నుండి కోపంగా వెళ్ళిపోయాడు. ధ్యాన్ చంద్ నైపుణ్యంతో భారత జట్టు వరసగా మూడోసారి గోల్డ్ మెడల్ సాధించాడు.

హిట్లర్ తో సంభాషణ: గెలిచినా ఆనందంలో ఉన్న ధ్యాన్ చంద్ కు జర్మని ఆర్మీ అధికారులు రేపు ఉదయం హిట్లర్ చాంబర్ కు రావాలి అని చెప్పి వెళ్ళిపోయారు. హిట్లర్ పిలవడం తో రాత్రంతా నిద్రలేకుండా గడిపాడు భయంతో . ఉదయం హిట్లర్ తన జట్టును ఓడించినందుకు తనను కాల్చివేస్తాడేమోనని ఆందోళనతోనే హిట్లర్ చాంబర్ కు వెళ్ళాడు. ధ్యాన్ చంద్ ను చూసిన హిట్లర్ తన కుర్చిలోంచి లేచి “వెల్ కం కెప్టెన్ ధ్యాన్ చంద్ ప్లీజ్ సిట్ డౌన్ ” అంటూ తన చాంబర్ లోకి స్వాగతం పలికాడు. అది విని ధ్యాన్ చంద్ ఆశ్చర్యంగా బెరుకుగా థ్యాంక్యు ! గుడ్ మార్నింగ్ సర్ అంటూ కూర్చొన్నాడు. నీ ఆట చూసి నాకు చాల ఆశ్చర్యం కలిగింది సరైన బూట్లు , స్టిక్ లేకుండా మీరు అన్ని గోల్స్ చేశారంటే “Really you are great player” అంటూ పొగడ్తలతో మున్చేసాడు. అప్పటి వరకు భయం భయం గా ఉన్న ధ్యాన్ చంద్ ప్రశాంతంగా కూర్చొన్నాడు. మీ దేశం లో మీరు ఏమి చేస్తుంటారు అని అడిగాడు. నేను ఆర్మీ లో నాయక్ గా పనిచేస్తుంటాను అని చెప్పాడు. అది విని మీరు మా దేశానికి వస్తే ఆర్మీ లో అత్యునత పదవిని ఇస్తాను అని చోపుతు తన చేతతో స్వయంగా కాఫీ కప్పును ధ్యాన్ చంద్ కు అందిస్తాడు. దేశ భక్తి గల క్రీడాకారుడు ఆయన ధ్యాన్ చంద్ నన్ను క్షేమించండి నేను నా దేశం తరపునే ఆడాలి అనుకుంటున్నాను అని చెప్పటంతో హిట్లర్ ఆశ్చర్యంగా నీవు మంచి దేశభక్తి గల క్రీడాకారుడు అనుకుంటా అని, నీ ప్రతిభ మరియు దేశభక్తి రెండు నాకు నచ్చాయి అని చెప్పి ధ్యాన్ చంద్ కు సంతోషంగా వీడ్కోలు పలికాడు. అల జర్మనీ నియంత హిట్లర్ తో ప్రత్యేకంగా మాట్లాడిన మొదటి మరియు చివరి క్రీడాకారుడు ధ్యాన్ చంద్.
                                                      ధ్యాన్ చంద్ తన 22 సంవత్సరాల హాకీ కెరీర్ (1926-1948) లో ప్రపంచంలో ఏ హాకీ క్రీడాకారుడికి సాధ్యం కాని మరియు సాధించలేని 1000 గోల్స్ రికార్డును సాధించాడు. అందువలన ధ్యాన్ చంద్ ను ప్రపంచమంతా హాకీ మాంత్రికుడు గా కీర్తించబడ్డాడు. ఆర్మీ వారు ధ్యాన్ చంద్ ప్రతిభ కు మేజర్ పదవితో సత్కరించారు ( భారత ఆర్మీ లో సిపాయి నుండి మేజర్ పదోన్నతి పొందిన మొదటి వ్యక్తి ధ్యాన్ చంద్ ). భారత ప్రభుత్వం 1956 లో పద్మభూషణ్ అవార్డ్ తో సత్కరించింది. 1979 డిశెంబర్ 3 వ తేదిన క్యాన్సర్ తో మరణించాడు. తన గౌరవార్ధం భారత ప్రభుత్వం ధ్యాన్ చంద్ జయంతి అయిన ప్రతి ఆగష్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరపాలి అని నిర్ణయించారు.
కొందరి మాటలలో ధ్యాన్ చంద్ గొప్పతనం:
“క్రికెట్ లో పరుగులు సాధించినంత తేలికగా హాకీ లో గోల్స్ చేస్తాడు”. –డోనాల్డ్ బ్రాడ్ మాన్
“నా గొడుగు ఇచ్చినా అతను గోల్స్ చేయగలడు”. – బ్రిటిష్ రాణి
“ అతను హాకీ మాంత్రికుడు”. – ప్రపంచ పత్రికలు