SGFI-ELIGIBILITY-FORM 2019-20 PDF Free Download here
AP CM CUP మరియు APSGF నిబందనలు ప్రకారం పాఠశాల మరియు కళాశాల క్రీడా జట్ల ఎంపిక నిబంధనలు (2019-20)
2019-20 విద్య సంవత్సరం పాఠశాల విద్యాశాఖ స్కూల్ గేమ్స్ ను ap cm cup games పేరుతో నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలు నియోజకవర్గ స్థాయి లో ఖో-ఖో , కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ మిగిలినవి జిల్లా స్థాయిలో సెలక్షన్ పద్దతిలో జరుగుతాయి.
వయస్సు నిబందనలు (SGFI-2019-20 ప్రకారం) :
- 11 సంవత్సరముల లోపు విద్యార్థులు 01/01/2009 న, ఆ తరువాత పుట్టిన వారు 3 నుండి 6వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులు అర్హులు.
- 14 సంవత్సరముల లోపు విద్యార్థులు 01/01/2006 న, ఆ తరువాత పుట్టిన వారు 6 నుండి 9వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులు అర్హులు.
- 17 సంవత్సరముల లోపు విద్యార్థులు 01/01/2003 న, ఆ తరువాత పుట్టిన వారు ఇంటర్ లోపు చదువుతున్న విద్యార్థులు అర్హులు.
- 19 సంవత్సరముల లోపు విద్యార్థులు 01/01/2001 న, ఆ తరువాత పుట్టిన వారు ఇంటర్ లోపు చదువుతున్న విద్యార్థులు అర్హులు.
ఎంపిక సమయంలో తప్పనిసరిగా చూపవలసిన ద్రువపత్రాలు:
పాటశాల విద్యార్థులు : ప్రధానోపాధ్యాయులు చే ద్రువికరించిన స్టడీ, ఆధార్, ఆన్లైన్ ఎంట్రీ తప్పనిసరి.
కళాశాల విద్యార్థులు(ఇంటర్మీడియట్) : ప్రిన్సిపాల్ చే ద్రువికరించిన స్టడీ, ఆధార్, ssc సర్టిఫికేట్, ఆన్లైన్ ఎంట్రీ లను attested తప్పనిసరి.
క్రీడలలో పాల్గొనటకు online నమోదు చేసుకునే విధానం :
అధికారిక వెబ్ సైట్ apcmcup.in
Google browser లో apcmcup.in నమోదు చేయగానే క్రింది విధంగా వెబ్ సైట్ పేజి ప్రత్యక్షం అవుతుంది.
పై menu bar లో ఉన్న వివరాలలో entries login బటన్ మీద click చేయాలి. అప్పుడు క్రింది చిత్రంలో విధంగా కాలమ్స్ చూపించబాడును. అందులో మండలం స్థాయి అయితే Mandal level బటన్ మీద , జిల్లా స్థాయి అయితే District level బటన్ మీద click చేయాలి.
పై చిత్రంలో చూపిన విధంగా 10 కాలమ్స్ లను అన్నిటిని తప్పనిసరిగా జాగ్రతగా నమోదు చేయవలెను.
- Select Tournament – CM Cup 2019
- Select District – మీ జిల్లా పేరు
- Select Mandal – మీ మండలం పేరు
- Select Discipline – క్రీడ పేరు (Ex: Kabaddi)
- Discipline Type – జట్టు లేదా సెలెక్షన్స్ ( Team/Probables)
- Select Category – వయసు విభాగం (Age group)
- Number of players – జట్టు క్రీడాకారుల సంఖ్య (SGFI- నిభందనలు ప్రకారం. ఉదాహరణకు: కబడ్డీ –12)
- School Name – మీ పాఠశాల పేరు
- Enter School Email – పాటశాల లేదా మీ వ్యక్తిగత మెయిల్ ఐడి
- Enter School Phone – ప్రధానోపాధ్యాయులు లేదా మీ వ్యక్తిగత ఫోన్ నెంబర్పై వివరాలు నమోదు పూర్తి అయిన తరవాత క్రింది చిత్రంలో విధంగా కాలమ్స్ లలో విద్యార్థుల సమాచారం జాగ్రతగా పూర్తి చేయవలెను.
- First Name – విద్యార్థి పేరు
- Surename – ఇంటి పేరు లేదా ఇన్సియల్
- Gander – మగ / ఆడ
- Date of birth – పుట్టిన తేది ఆధార్ నెంబర్ నమోదు చేసిన వెంటనే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. (తప్పనిసరిగా పాఠశాల మరియు ఆధార్ లో ఒకే విధంగా ఉండాలి)
- Age – పుట్టిన తేది నమోదు చేయగానే వయస్సు ఆటోమేటిక్ వచ్చేస్తుంది.
- Child info number – పాఠశాలలోని విద్యార్థి చైల్డ్ ఇన్ఫో నెంబర్. కళాశాల విద్యార్థులు అయితే అడ్మిషన్ నెంబర్
· పై వివరాలు ప్రకారం విద్యార్థుల వివరాలు నమోదు పూర్తి అయిన తరువాత క్రింద గ Register Now మీద click చేయాలి.
· అప్పుడు players added, Please check your Email for Player(s) Confirmation అని చూపిస్తుంది.
· మండల స్థాయి జట్టును నియోజకవర్గ పోటిలకు , నియోజకవర్గ స్థాయి జట్లను జిల్లా స్థాయి పోటిలకు ప్రమోట్ చేయు విధానం.
నియోజకవర్గ స్థాయికి ఎంపికైన క్రీడాకారులను ప్రమోట్ చేసే విధానం:
Organizer Login ➡
Manage ➡
Tournament ➡
Manage Tournament ➡
Select Discipline (Game) ➡
Select Discipline Type(Team) ➡
Select Discipline Catagery (U-17Boys or Girls) ➡
Select Players(ఏ పాఠశాల నుండి క్రీడాకారులను ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఆ పాఠశాలకు ఎడమ వైపు ఉన్న బటన్ Click చేయాలి )➡
Select Box (Select అయిన విద్యార్ధి పేరు ముందు ఉన్న బటన్ ను Click చేయాలి ) ➡
Promote (ఆ పాఠశాల నుండి select అయిన విద్యార్దులందరిని select చేయాలి. నియోజకవర్గ జట్లను ప్రమోట్ చేయాలి )
సందేహాలు మరియు సమాధానాలు :
1. U-11 విభాగంలో కేవలం స్కెటింగ్ మాత్రమే ఉంటుంది.
2. ఒక విద్యార్థి ఒక అకాడమిక్ ఇయర్ లో కేవలం ఒక విభాగంలో మాత్రమే పోటీ చేయవలెను. ( ఈ నిబంధన గతంలో కూడా ఉంది కాబట్టి ఆన్లైన్ ఎంట్రీ సాధ్యం కాదు)
3. పుట్టిన తేది కి ఆధార్ ప్రకారం కాకుండా స్కూల్ అడ్మిషన్ రిజిస్టర్ మాత్రమే ప్రామాణికం. (చైల్డ్ ఇన్ఫో లో కూడా ఒకే విధంగా ఉండాలి).
4. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు ముందు విద్యార్థుల పుట్టిన తేదిని స్కూల్ రికార్డ్ ప్రకారం సరిచేసుకొని నమోదు చేయడం ఉత్తమం. లేకపోతే ఆధార్ నమోదు చేయగానే ఆధార్ లేదా చైల్డ్ ఇన్ఫో లోని పుట్టిన రోజు ఆటోమేటిక్ గా నమోదు అవుతుంది. (స్కూల్ రికార్డ్ ప్రకారం కాకుండా)
5. ఒక వేళ చైల్డ్ ఇన్ఫో మరియు ఆధార్ ప్రకారం స్కూల్ రికార్డ్ తో సరిపోకపోతే వెంటనే స్కూల్ చైల్డ్ ఇన్ఫో లో అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం సరిచేసుకున్న తరువాత ఆన్లైన్ ఎంట్రీ చేసుకోవడం వలన విద్యార్థులకు నష్టం జరగదు.
6. ఈ సంవత్సరం డ్రాప్ ఔట్స్ ఎక్కువ మంది చైల్డ్ ఇన్ఫో లో నమోదు చేయబడ్డారు. కావున ఒకసారి విద్యార్థి ప్రస్తుత చైల్డ్ ఇన్ఫో సరిచూసుకోవాలి.
7. ఇంటర్ విద్యార్థులు చైల్డ్ ఇన్ఫో నెంబర్ కు బదులుగా అడ్మిషన్ నెంబర్ వేయాలి.
8. ఇంటర్ విద్యార్థులు ఆడే సమయంలో స్టడీ సర్టిఫికెట్ తో పాటు ఆధార్ కార్డ్ జిరాక్స్ చూపించవలెను.
9. పాఠశాల స్థాయిలో అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేపర్స్ తో పాటు క్రీడాకారుల ఆధార్ కార్డ్ జిరాక్స్ తప్పని సరగా ఉండాలి. (ప్లేయర్ యొక్క ఫోటో గుర్తింపు కోసం)
10. స్కూల్ గేమ్స్ లో ఒక విద్యార్థి ఒక సమవత్సరం 3 క్రీడలలో మాత్రమే పాల్గొనాలి.
11. పాఠశాలల తరపున ఇంటర్ విద్యార్థులను ఆడించారాదు.
12. మండలం, నియోజకవర్గం, జిల్లా అన్ని స్థాయి పోటీలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తో పాటు తప్పని సరిగా విద్యార్థుల ఫోటో గుర్తింపు కోసం ఆధార్ తప్పనిసరి ఉంచవలెను.
13. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన తరువాత ముఖ్య సమస్య అయిన pdf మన మెయిల్ కు రాకపోవడానికి ముఖ్య కారణం తప్పనిసరిగా మెయిల్ ఐడి జాగ్రత్తగా తప్పులు లేకుండా నమోదు చేయకపోవడం.. ఒకవేళ pdf రానియడల apcmcup@gmail.com కు మీ పాఠశాల వివరాలు, సమస్యలు పంపవలెను.
14. ఏదైనా తేదీ మరియు షెడ్యూలు విషయాలు ఎప్పటికప్పుడు ap sgfi వారు in లో scroll చేస్తుంటారు. మీరు ఈ website తరుచుగా చూడాలి.
15. వెబ్సైట్ అథ్లెటిక్స్ లో ప్రస్తుతం ఉన్న అవకాశం ను బట్టి అథ్లెటిక్స్ లో అందరి విద్యార్థులను కాకుండా వ్యక్తిగతంగా మాత్రమే నమోదు చేయుటకు అవకాశం కలదు.
పై సందేహాలకు క్రింది నెంబర్ లకు సంప్రదించవలెను:
AP CMCUP-19
Technical Co-Ordinator
Suresh Rayani
8121494323
rayanisuresh1990@gmail.com
1. Kadapa, Krishna, Visakhapatnam
Kalyan Chakravarthy.M
9703840584
apcmcup@gmail.com
2. Kurnool, Guntur, Nellore
Rakesh.M
8297390584
apcmcup@gmail.com
3. Vizianagaram, West Godavari, Srikakulam
Prashanth.B
9703620584
apcmcup@gmail.com
4. Prakasam, Chitoor, Anantapur, East Godavari
Gowri.V
9705426473
apcmcup@gmail.com
క్రీడలు నిర్వహించు తేదీలు క్రింద అప్డేట్ చేయబడుతాయి.