AP CM CUP 2018-19

AP CM CUP  మరియు APSGF నిబందనలు ప్రకారం పాఠశాల మరియు కళాశాల క్రీడా జట్ల ఎంపిక నిబంధనలు (2018-19)

                   2018-19 విద్య సంవత్సరం నుండి పాఠశాల విద్యాశాఖ మరియు saap సంయుక్తంగా స్కూల్ గేమ్స్ (SGFI) మరియు పాఠశాల క్రీడలను(జోనల్స్) ను apcmcup cum school games  పేరుతో నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలను మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో టోర్నమెంట్ కం సెలక్షన్ పద్దతిలో జరుగుతాయి. దీని ప్రధాన ఉద్దేశం నాణ్యమైన క్రీడాకారులను తయారుచేయటం, ఉత్తమ జట్లను జాతీయ స్థాయి పోటిలకు పంపడం, క్షేత్రస్థాయి నుండి అర్హులైన క్రీడాకారులను ఎంపిక చేయడం, ప్రభుత్వం ద్వార క్రీడాకారులకు, క్రీడానిర్వహనకు ఆర్థిక సహాయం అందించడం,  ఆన్లైన్ ఎంట్రీ ద్వార క్రింది స్థాయి నుండి అక్రమాలను అరికట్టడం దీని ముక్య ఉద్దేశం.

వయస్సు నిబందనలు(SGFI-2018-19 ప్రకారం) :

  • 11 సంవత్సరముల లోపు విద్యార్థులు 01/01/2008 న, ఆ తరువాత పుట్టిన వారు మరియు 5వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.
  • 14 సంవత్సరముల లోపు విద్యార్థులు 01/01/2005 న, ఆ తరువాత పుట్టిన వారు మరియు తప్పనిసరి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. తరగతి తో సంబంధం లేదు. వయస్సు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.
  • 17 సంవత్సరముల లోపు విద్యార్థులు 01/01/2002 న, ఆ తరువాత పుట్టిన వారు మరియు తప్పనిసరి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. తరగతి తో సంబంధం లేదు. వయస్సు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.

ఎంపిక సమయంలో తప్పనిసరిగా చూపవలసిన ద్రువపత్రాలు:

పాటశాల విద్యార్థులు : ప్రధానోపాధ్యాయులు చే ద్రువికరించిన స్టడీ, ఆధార్, ఆన్లైన్ ఎంట్రీ తప్పనిసరి.

కళాశాల విద్యార్థులు(ఇంటర్మీడియట్) : ప్రిన్సిపాల్ చే ద్రువికరించిన స్టడీ, ఆధార్, ssc, ఆన్లైన్ ఎంట్రీ లను attested తప్పనిసరి.

Phase-1: టోర్నమెంట్ కం సెలక్షన్ (అండర్-14,17 Boys and Girls). నిర్వహించవలసిన క్రీడలు.

క్రీడలు-పట్టిక

1.     ఖో-ఖో 2.     కబడ్డీ 3.  వాలీబాల్ 4. హ్యాండ్ బాల్ 5. టెన్నీకాయిట్
6. యోగ 7. బాల్ బాడ్మింటన్ 8. త్రో బాల్ 9. అథ్లెటిక్స్

మండల స్థాయి పోటీలు: మండలంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలలు పాల్గొనటకు అర్హులు.

నిర్వహించు విధానం:  టోర్నమెంట్ కం సెలక్షన్. జట్లు మాత్రమే టోర్నమెంట్ లో పాల్గొనాలి. జట్లు లేని పాఠశాలలు మరియు కళాశాలలు విద్యార్థులు టోర్నమెంట్ తరువాత జరిగే సెలెక్షన్స్ లో మాత్రమే పాల్గొనాలి. వారు ఆన్లైన్ ఎంట్రీ తప్పనిసరిగా నిబందనలు ప్రకారం  నమోదు చేసి ఉండవలెను.

నియోజకవర్గ స్థాయి పోటీలు: కేవలం మండల స్థాయిలో ఎంపిక చేయబడిన మండల జట్లు మాత్రమే అర్హులు. ఇందులో నేరుగా జట్లుగాని, సెలెక్షన్స్ గాని పాల్గొనరాదు.

నిర్వహించు విధానం:  టోర్నమెంట్ కం సెలక్షన్. ఇందులో టోర్నమెంట్ తరువాత సెలెక్షన్స్ నిర్వహించి ఉత్తమ క్రీడాకారులతో ఎంపిక చేయవలెను.ఆ జట్టును మాత్రమే జిల్లా స్థాయి పోటిలకు పంపవలెను.

జిల్లా స్థాయి పోటీలు: కేవలం నియోజకవర్గ స్థాయిలో ఎంపిక చేయబడిన నియోజకవర్గ జట్లు మాత్రమే అర్హులు. ఇందులో నేరుగా జట్లుగాని, సెలెక్షన్స్ గాని పాల్గొనరాదు. (phase-2 తప్ప)

నిర్వహించు విధానం:  టోర్నమెంట్ కం సెలక్షన్. ఇందులో టోర్నమెంట్ తరువాత సెలెక్షన్స్ నిర్వహించి ఉత్తమ క్రీడాకారులతో ఎంపిక చేయవలెను.ఆ జట్టును మాత్రమే రాష్ట్ర స్థాయి పోటిలకు పంపవలెను.

Phase-2: టోర్నమెంట్ కం సెలక్షన్ (అండర్-14,17 Boys and Girls). నిర్వహించవలసిన క్రీడలు.

క్రీడలు-పట్టిక

1. ఆర్చరీ 2. ఫీల్డ్ ఆర్చరీ 3. బాడ్మింటన్ 4. బేస్ బాల్ 5. బాస్కెట్ బాల్
6. చెస్ 7. క్రికెట్ 8. సైక్లింగ్ 9. ఫెన్సింగ్ 10. ఫుట్ బాల్
11. జిమ్నాస్టిక్స్ 12. హాకీ 13. జూడో 14. లాన్ టెన్నిస్ 15. షూటింగ్
16. సెపక్ తక్రా 17. సాఫ్ట్ బాల్ 18. స్విమ్మింగ్ 19. టేబుల్ టెన్నిస్ 20. టైక్వాండో
21. వెయిట్ లిఫ్టింగ్

(U-17)

22. రెస్లింగ్ 23. నెట్ బాల్ 24. రగ్బీ 25. రోప్ స్కిప్పింగ్
26. స్కేటింగ్

(U-11,14,17)

27.మోడరన్ పెంటాథ్లిన్

క్రీడలలో పాల్గొనటకు online నమోదు చేసుకునే విధానం :

అధికారిక వెబ్ సైట్ apcmcup.in

Google browser లో apcmcup.in నమోదు చేయగానే క్రింది విధంగా వెబ్ సైట్ పేజి ప్రత్యక్షం అవుతుంది.

పై menu bar లో ఉన్న వివరాలలో entries login బటన్ మీద click చేయాలి. అప్పుడు క్రింది చిత్రంలో విధంగా కాలమ్స్  చూపించబాడును. అందులో మండలం స్థాయి అయితే Mandal level బటన్ మీద , జిల్లా స్థాయి అయితే District level బటన్ మీద click చేయాలి.

పై చిత్రంలో చూపిన విధంగా 10 కాలమ్స్ లను అన్నిటిని తప్పనిసరిగా జాగ్రతగా నమోదు చేయవలెను.

  1. Select Tournament – CM Cup 2018
  2. Select District – మీ జిల్లా పేరు
  3. Select Mandal   –  మీ మండలం పేరు
  4. Select Discipline  –  క్రీడ పేరు (Ex: Kabaddi)
  5. Discipline Type – జట్టు లేదా సెలెక్షన్స్ ( Team/Probables)
  6. Select Category – వయసు విభాగం (Age group)
  7. Number of players – జట్టు క్రీడాకారుల సంఖ్య (SGFI- నిభందనలు ప్రకారం. ఉదాహరణకు: కబడ్డీ -12)
  8. School Name – మీ పాఠశాల పేరు
  9. Enter School Email – పాటశాల లేదా మీ వ్యక్తిగత మెయిల్ ఐడి
  10. Enter School Phone – ప్రధానోపాధ్యాయులు లేదా మీ వ్యక్తిగత ఫోన్ నెంబర్

పై వివరాలు నమోదు పూర్తి అయిన తరవాత క్రింది చిత్రంలో విధంగా కాలమ్స్ లలో  విద్యార్థుల సమాచారం జాగ్రతగా పూర్తి చేయవలెను.

  1. First Name  –  విద్యార్థి పేరు
  2. Surename – ఇంటి పేరు లేదా ఇన్సియల్
  3. Gander        –  మగ / ఆడ
  4. Date of birth  –  పుట్టిన తేది (తప్పనిసరిగా పాఠశాల మరియు ఆధార్ లో ఒకే విధంగా ఉండాలి)
  5. Age  –  పుట్టిన తేది నమోదు చేయగానే వయస్సు ఆటోమేటిక్ వచ్చేస్తుంది.
  6. Child info number – పాఠశాలలోని విద్యార్థి చైల్డ్ ఇన్ఫో నెంబర్. కళాశాల విద్యార్థులు అయితే అడ్మిషన్ నెంబర్
  7. Aadhar  –  ఆధార్ నెంబర్  

పై వివరాలు ప్రకారం విద్యార్థుల వివరాలు నమోదు పూర్తి అయిన తరువాత క్రింద గ Register Now మీద click చేయాలి.

అప్పుడు players added, Please check your Email for Player(s) Confirmation అని చూపిస్తుంది.

మండల స్థాయి జట్టును నియోజకవర్గ పోటిలకు , నియోజకవర్గ స్థాయి జట్లను జిల్లా స్థాయి పోటిలకు ప్రమోట్ చేయు విధానం.

 

నియోజకవర్గ స్థాయికి ఎంపికైన క్రీడాకారులను ప్రమోట్ చేసే విధానం:

Organizer Login ➡

Manage  ➡

Tournament ➡

Manage Tournament ➡

Select Discipline (Game) ➡

Select Discipline Type(Team) ➡

Select Discipline Catagery (U-17Boys or Girls) ➡

Select Players (ఏ పాఠశాల నుండి క్రీడాకారులను ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఆ పాఠశాలకు ఎడమ వైపు ఉన్న బటన్ Click చేయాలి )➡

Select Box (Select అయిన విద్యార్ధి పేరు ముందు ఉన్న బటన్ ను Click చేయాలి ) ➡

Promote  (ఆ పాఠశాల నుండి select అయిన విద్యార్దులందరిని select చేయాలి. అలా మండలం మరియు నియోజకవర్గ జట్లను ప్రమోట్ చేయాలి )

సందేహాలు మరియు సమాధానాలు :

  • స్కూల్ గేమ్స్ లో ఒక విద్యార్థి ఎన్ని క్రీడలో అయిన పాల్గొనవచ్చు.
  • పాఠశాలల తరపున ఇంటర్ విద్యార్థులను ఆడించారాదు.
  • మండలం, నియోజకవర్గం, జిల్లా అన్ని స్థాయి పోటీలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తో పాటు తప్పని సరిగా విద్యార్థుల ఫోటో గుర్తింపు కోసం ఆధార్ తప్పనిసరి ఉంచవలెను.
  • ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన తరువాత ముఖ్య సమస్య అయిన pdf మన మెయిల్ కు రాకపోవడానికి ముఖ్య కారణం తప్పనిసరిగా మెయిల్ ఐడి జాగ్రత్తగా తప్పులు లేకుండా నమోదు చేయకపోవడం.. ఒకవేళ pdf రానియడల apcmcup@gmail.com కు మీ పాఠశాల వివరాలు, సమస్యలు పంపవలెను.
  • ఏదైనా తేదీ మరియు షెడ్యూలు విషయాలు ఎప్పటికప్పుడు ap sgfi వారు in లో scroll చేస్తుంటారు. మీరు ఈ website తరుచుగా చూడాలి.
  • వెబ్సైట్ అథ్లెటిక్స్ లో ప్రస్తుతం ఉన్న అవకాశం ను బట్టి అథ్లెటిక్స్ లో అందరి విద్యార్థులను కాకుండా వ్యక్తిగతంగా మాత్రమే నమోదు చేయుటకు అవకాశం కలదు.

ఎప్పటికప్పుడు వివరలకు ఈ క్రింది scroll ను గమనించాలి:

పై సందేహాలకు క్రింది నెంబర్ లకు సంప్రదించవలెను: