డ్రిబుల్ అండ్ పాస్ విత్ లాడర్ ( Dribble and pass with ladder )
ప్లేయర్స్ ను ఒకే గ్రూప్ గా ఏర్పాటుగా చేసుకోని ఒకరి వెనుక మరొకరిని ఫైల్ ఫార్మేషన్ నిలబెట్టాలి.
- స్టార్టింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకోని, వాటి ఎదురుగా 2 మీటర్స్ దూరంలో ఒక మీటర్ వ్యత్యాసంతో 4 మార్కర్స్ ను లేదా కోన్స్ ను మరియు 2 నుండి 3 మీటర్స్ దూరంలో 4 మార్కర్స్ ను ఫైల్ ఫార్మేషన్ లో మరల ఏర్పాటు చేసుకోవాలి. చివరి మార్కర్ కు మొదటి మార్కర్ కు మధ్య రెండు మార్కర్స్ ను ప్రక్కన డైమండ్ ఆకారంలో ఏర్పాటు చేసుకోవాలి.
- అలాగే రెండు ఫైల్ మధ్య ఒక లాడర్ ను ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ లాడర్ అందుబాటులో లేకపోతే మార్కింగ్ చేయవచ్చు. ఆ రెండు మార్కర్స్ దగ్గర మొదటి చివరి ప్లేయర్స్ ను నిలబెట్టాలి. ( పై చిత్రం లో మాదిరిగా )
- గ్రూప్ లోని రెండవ ప్లేయర్ బాల్ ను మొదటి ఫైల్ లోని మార్కర్స్ మధ్య డ్రిబ్బ్లింగ్ చేసుకుంటూ వెళ్లి, బాల్ ను తన ఎడమ ప్రక్కన ఉన్న మొదటి ప్లేయర్ కు డైయగ్నల్ పాస్ చేసి లాడర్ లో పరిగెత్తుతూ మరల తిరిగి రిటర్న్ పాస్ పొంది డ్రిబ్బ్లింగ్ పూర్తి చేయాలి.
- అలాగే రిటర్న్ లో కూడా డ్రిబుల్ అండ్ పాస్ చేసుకుంటూ లాడర్ లో పరిగెత్తుతూ మరల మూడవ ప్లేయర్ కు పాస్ ఇవ్వాలి. అదే సమయంలో రెండవ ప్లేయర్ డ్రిబ్బ్లింగ్ మొదలుపెట్టే లోపు 1 ప్లేయర్ 5 వ ప్లేయర్ స్థానంలోను,5 వ ప్లేయర్ గ్రూప్ చివర నిలబడాలి. ఈ విధంగా ప్లేయర్స్ వేగంగా మారుతూ ఉండాలి. అలా ఈ డ్రిల్ ను 10 నుండి 12 నిముషాలు పాటు చేయాలి.
- ఉపయోగాలు:
- ఇది బాల్ కంట్రోలింగ్ ఆధారిత డ్రిల్ (Ball controlling oriented drill).
- కండిషనింగ్ డ్రిల్(Conditioning drill) or (worming up drill) గా కూడా ఉపయోగపడుతుంది.
- ప్లేయర్ యొక్క బలహీన డ్రిబ్బ్లింగ్ (Weak dribbling) ల నుండి దూరం చేస్తుంది.
- డ్రిబ్బ్లింగ్ లో కచ్చితత్వం(accuracy) మరియు సామర్ధ్యం పెరుగుతుంది. రాజేష్ ఆగోల