P.T.USHA

                  పి. టి. ఉష 1964 జూన్ 27న కేరళ రాష్ట్రంలోని  కోజికోడ్ జిల్లా, పయోలి గ్రామంలో జన్మించింది. పూర్తి పేరు పిలఉల్లకండి తెక్కేరపెరంబిల్ ఉష. పరుగుల రాణి, పయోలి ఎక్స్‌ప్రెస్స్ గా ప్రసిద్ధి. 1976 సంవత్సరంలో అథ్లెటిక్ కోచ్ నంబియార్ ఒక క్రీడా ముగింపు సమావేశంలో తన అథ్లెటిక్ శరీరం మరియు వేగవంతమైన నడకను చూసి ఆమెలోని అథ్లెట్ ను గుర్తించి తన శిక్షణ కేంద్రంలో చేర్చుకున్నాడు. ఈమె కేన్ననోర్ వద్ద గ క్రీడా పాఠశాల నందు చేరింది. అక్కడి కోచ్ ఓ. పి. నంబియార్ ఆమెను రన్నింగ్‌ విభాగం లో శిక్షణ ఇచ్చాడు. 1978 కొల్లంలో జరిగిన స్కూల్ అథ్లెటిక్స్ లో 4 గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మరియు కాంస్యం తో 6 పతకాలని సాధించి సంచలనం సృష్టించింది. ఆ తరువాత  కేరళలో జరిగిన స్టేట్ కాలేజీ మీట్ లో 14 పథకాలతో రాష్ట్రంలో ఉత్తమ అథ్లెట్ గా నిలిచింది. 1979-80 మధ్య జరిగిన అనేక జాతీయ స్థాయి పరుగు పోటీలలో అనేక రికార్డ్స్ తో పతకాలు సాధించింది. 1980 మాస్కో ఒలింపిక్స్ లో 100m పరుగులో ఫైనల్ కు అర్హత సాధించలేక పోయింది. 1981 బెంగుళూర్ లో జరిగిన సీనియర్ అథ్లెటిక్స్ లో 100m పరుగులో 11.8 sec మరియు 200m పరుగులో 24.6 sce తో జాతీయ రికార్డ్స్ నెలకొల్పింది. 1982 న్యూ ఢిల్లీ లో జరిగిన ఆసియా క్రీడలలో 100m మరియు 200m పరుగు పందెంలో సిల్వర్ మెడల్స్ సాధించింది.

                             1984 లాస్ ఏంజెల్స్(అమెరికా) లో జరిగిన ఒలింపిక్ 400 హర్డిల్స్ విభాగంలో జరిగిన ఫైనల్ పరుగులో 55.42 sec సమయంతో నాల్గోవ స్థానంలో నిలిచింది. కేవలం ఒక్క సెకను తో  కాంస్యం పథకం కోల్పోయింది. ఆ తరువాత 1985 ఇండోనేషియా రాజధాని జకార్తా ఆసియా క్రీడలలో ఐదు గోల్డ్ మెడల్స్ మరియు ఒక కాంస్యం తో 6 పథకాలు సాధించింది. 1986 దక్షిణ కొరియా సియోల్ ఆసియా క్రీడలోను నాలుగు గోల్డ్ మరియు ఒక సిల్వర్ తో ఐదు పతకాలు సాధించింది. పి. టి. ఉష తన కెరీర్ లో 100 కు పైగా అంతర్జాతీయ పతకాలు సాధించింది. నంబియార్ శిక్షణలో పి. టి. ఉష కేవలం భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలో ఓకే తిరుగులేని అథ్లెట్ గా అవతరించింది. అత్యంత నైపుణ్యం గల మహిళా అథ్లెట్ గా భారతదేశానికి ఒక గర్వకారణం గ నిలిచింది. ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశానికి ఎనలేని కీర్తిని తెచ్చింది. భారత క్రీడా రంగం లో “పరుగుల రాణి ” గా పేరు ప్రఖ్యాతలు సాధించింది. పి. టి. ఉష “ ఉష స్కూల్ అఫ్ అథ్లెట్” అనే పేరు తో ఒక శిక్షణ కేంద్రం ను ఏర్పాటు చేస్తూ అనేకమంది క్రీడాకారులకు అథ్లెటిక్స్ లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇస్తుంది.   

పి. టి. ఉష పొందిన అవార్డ్స్:

1984- అర్జున అవార్డ్.               1985- గ్రే టెస్ట్ విమెన్ అథ్లెట్.

 1984- పద్మశ్రీ అవార్డ్.             1984, 85, 86, 87, 89- బెస్ట్ ఆసియన్ అథ్లెట్ అవార్డ్.

1986- బెస్ట్ గోల్డెన్‌ బూట్ అఫ్ అథ్లెట్ (సియోల్ ఆసియా క్రీడలు).