Sachin Tendulkar

                  సచిన్ రమేశ్  టెండూల్కర్ ప్రసిద్ధ క్రికెటర్ లలో ఒకడు. మాస్టర్ బ్లాస్టర్ , గాడ్ అఫ్ క్రికెట్ గా ప్రపంచ క్రికెట్ అభిమానులలో ఎన్నటికి చెరిగిపోని ముద్ర వేశాడు. క్రికెట్ క్రీడలో తనదైన శైలిలో ఎన్నో ప్రపంచ రికార్డ్ లను తన పేరు మీద లిఖించుకొని దిగ్గజ క్రికెటర్ గా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు. అతి చిన్నవయసులోనే అంతర్జాతీయ క్రికెటర్ గా ఆరగ్రేటం చేశాడు. 24 సంవత్సరాలు పాటు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. క్రికెట్ చరిత్రలో దాదాపు ఎవరికీ సాధ్యం కాని వంద అంతర్జాతీయ సెంచరీలు (టెస్ట్ మరియు వన్ డే క్రికెట్) సాధించాడు. అంతే కాక వన్ డే క్రికెట్ లో 200  పరుగులు( దక్షిణ ఆఫ్రికా జట్టుపై) మైలురాయిని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్ సచిన్. మొత్తం తన అంతర్జాతీయ కెరీరు లో 30 వేల పైగా పరుగులు సాధించాడు. తన చిరకాల స్వప్నమైన వన్ డే ప్రపంచ కప్పును 2011 ఏప్రిల్ 2 వ తేదిన తన సొంత నగరం ముంబాయి మరియు సొంత మైదానం సాధించాడు.

బాల్యం: సచిన్ టెండూల్కర్ 1973, ఏప్రిల్ 24 వ తేదిన మహారాష్ట్ర లోని ముంబాయి నగరమూ లో జన్మించాడు. తండ్రి రమేశ్ టెండూల్కర్ , తల్లి పేరు రజని. భార్య పేరు అంజలి, కూతురు సార టెండూల్కర్ , కుమారుడు అర్జున్ టెండుల్కర్. సచిన్ మొదట టెన్నిస్ క్రీడను ఎక్కువగా ఇష్టపడే వాడు. తన కు ఇష్టమైన క్రీడాకారుడు జాన్ మేకన్రో (అమెరికా టెన్నిస్ క్రీడాకారుడు) కాని సోదరుడు అజిత్ సచిన్ లోని క్రికెట్ ప్రతిభను గుర్తించి అప్పటి క్రికెట్ కోచ్ ఆయన రమాకాంత్ అచ్రేకర్ దగ్గర క్రికెట్ ఓనమాలు నేర్పించాడు. మొదటి లో సచిన్ బౌలింగ్ ను ఎక్కువగా ఇష్టపడే వాడు. ఒకసారి చెన్నై లో జరిగిన యం.ఆర్.యఫ్. బౌలింగ్ అకాడమి  సెలక్షన్ లో పాలుగోన్నాడు కాని  ఎత్తు లేకపోవడం వలన అప్పటి బౌలింగ్ కోచ్ డెన్నిస్ లిల్లీ సచిన్ ను సెలెక్ట్ చేయలేదు. తీవ్ర నిరాశ చెందిన సచిన్‌కు కోచ్ రమాకాంత్ అచ్రేకర్ బ్యాటింగ్ లో శిక్షణ ఇచ్చాడు. కోచ్ నిర్ణయంతో సచిన్ లోని ఒక దిగ్గజ క్రికెటర్ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. తన చదివే శారదాశ్రమ్ తరపున ముంబాయి లో జరిగే ప్రఖ్యాత టోర్నమెంట్ లార్డ్ హ్యరీష్ షీల్డ్ ( ఇంటర్ స్కూల్ టోర్నమెంట్) స్కూల్ క్రికెట్ లో తన సహచరుడు వినోద్ కాంబ్లి తో కలిసి 664 పరుగులు ( సచిన్ 326 నాట్ అవుట్) అజేయ భాగస్వామ్యం నెలకొల్పి జాతీయ, అంతర్జాతీయంగా ప్రఖ్యాతలు సాధించి క్రికెట్ సెలక్టర్స్ దృష్టిలో పడ్డాడు.

క్రికెట్ కెరీర్: స్కూల్ లెవెల్ లో అద్భుతమైన ప్రతిభతో క్రికెట్ సెలెక్టర్స్ దృష్టి ఆకర్షించాడు. కాని అప్పటి నిబంధనలు ప్రకారం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడడానికి కనీస వయసు 18 సంవత్సరాలు కాని సచిన్ వయసు 15 సంవత్సరాలు. సచిన్ కోసం అప్పటి బీ.సీ.సీ.ఐ అధ్యక్షుడు రాజ్ సింగ్ దుంగార్పూర్ నిబంధనలు మార్చడం తో అతి చిన్న వయసులో రంజీ ట్రోఫీ ఆడే అవకాశం దక్కింది. తన కోసం సడలించిన నిబంధనలు సరైనదే అని నిరూపిస్తూ తాను ఆడిన అన్ని మొట్టమొదటి ఫస్ట్ క్లాసు క్రికెట్ మ్యాచ్ (రంజీ, ఇరానీ మరియు దులిప్ ట్రోఫీ) లలోనే సెంచరీలు చేసి, ఆ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్ సచిన్. ఫలితంగా అతి చిన్న వయసులో భారత క్రికెట్ జట్టు కు ఎంపికైన మొట్ట మొదటి భారతీయుడు గా రికార్డ్ ను నెలకొల్పాడు. 1989 నవంబర్ పాకిస్థాన్ టూర్ కు వెళ్ళే భారత జట్టుకు ఎంపిక అయ్యాడు. కరాచీ లో జరిగిన పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ (1989 నవంబర్, 15 నాటికి సచిన్ వయసు కేవలం 16 సం ల 205 రోజులు. అది అప్పటికి అంతర్జాతీయంగా కూడా ప్రపంచ రికార్డ్) తో మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను ప్రారంభించాడు.                           

                             అలా అంతర్జాతీయ కెరీర్లో దాదాపు ప్రతి క్రికెట్ దేశంపై అనేక రికార్డులతో భారత జట్టుకు అనేక విజయాలు సాధించాడు. తన కెరీర్ లో దాదాపు 200 టెస్ట్ మ్యాచ్ లు ఆడి (ఆ ఘనత సాధించిన మొదటి క్రికెటర్ గా నిలిచాడు) 15,921 పరుగులు చేశాడు. అలాగే 463 వన్ డే మ్యాచ్ లు అది 18,426 పరుగులు (రెండు కలిపి 30 వేలకు పైగా పరుగులు) సాధించి కలలో కూడా కొన్ని రికార్డ్స్ ఏ క్రికెటర్ కూడా ఊహించని స్థాయిలో రికార్డ్స్ నెలకొల్పాడు. 2011 వన్ డే ప్రపంచ కప్ ను సాధించాడు.  వంద అంతర్జాతీయ సెంచరీలు తోపాటు  ఎన్నో ప్రపంచ క్రికెట్ రికార్డ్స్ ను తన పేరు మీద లిఖించుకొని దిగ్గజ క్రికెటర్ గా పేరు గడించాడు. 2013 నవంబర్ 13న వెస్ట్ ఇండీస్ తో ముంబాయి లో జరిగిన మ్యాచ్ తో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు.

సచిన్ కు వచ్చిన అవార్డ్స్ :

1994- అర్జున్ అవార్డ్                                            1999- పద్మశ్రీ అవార్డ్

1997- విస్డెన్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డ్                 2008- పద్మవిభూషణ్ అవార్డ్

1997-98 – రాజీవ్ గాంధీ ఖేలరత్న అవార్డ్                  2012- హానర్ మెంబర అఫ్ ఆర్డర్ అఫ్ ఆస్ట్రేలియా అవార్డ్

2014- భారత రత్న అవార్డ్

ఆంధ్రప్రదేశ్ తో  ప్రత్యేక అనుబంధం:  2014 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రారంభించిన పీ.యంస్. సన్సద్ ఆదర్శ గ్రామ యోజన (SAGY) పథకం లో భాగంగా  2014 నవంబర్ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని పుట్టం రాజువారి కండ్రంగి గ్రామ సమీపంలోని గొల్లపల్లి గ్రామని దత్తతకు తీసుకొని అభిరుద్ది చేస్తున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*